ఖమ్మంలో తెరాస భారి బహిరంగ సభకు హాజరైన కేసిఆర్

SMTV Desk 2018-11-19 16:54:22  Telangana elections, TRS, K chandra shekar rao, Khammam district

ఖమ్మం, నవంబర్ 19: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అపద్దర్మ్మ ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు ఖమ్మం జిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ "రాష్ట్రం బాగుండాలని రాజశ్యామల హోమం చేసాను. ఖమ్మం తలపండిన రాజకీయ నేతలున్న జిల్లా ఇదే జిల్లలో 10 కి 10 స్థానాల్లో గెలవబోతున్నాం. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాకు చాల సార్లు వచ్చాను అని ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తీ చేస్తా అలాగే డబుల్ బెడ్ రూమ్ , దళితులకి మూడెకరాల భూమి అంటే విమర్శులు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకి రూపాయి లోను లేదు 100 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు 6 నెలలు ఆలస్యం అయితే కొంపలేం అంటుకోవు.

వొక్కసారి ఇల్లు కట్టిస్తే పేదవాళ్ళకు రెండు తరాల వరకు వాళ్ళు ఇళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం లేదు. వొక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు టిడిపి కాంగ్రెస్ కట్టిన ఏడూ ఇళ్ళకు సమానం అంటూ వెల్లడించారు.

అలాగే ప్రతిపక్ష పార్టీలపై కూడా మండిపడ్డారు. ఖమ్మం జిల్లా టిడిపి నేతలను నిలదీయాలి. ఏం ముఖం పెట్టుకొని టిడిపి వాళ్ళు వోట్లు అడగడానికి వొస్తున్నారు. గత కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలకు కంటి సమస్య కనిపించలేదా, గత కాంగ్రెస్, టిడిపిలకు కరెంట్ సమస్య కనిపించలేదా, కాంగ్రెస్ టిడిపి, ప్రభుత్వాలు ప్రాజెక్టులని విస్మరించారు. ఖమ్మం జిల్లా పచ్చగా మారాలంటే సీతారాం ప్రాజెక్టు పూర్తి కావాలి. సీతారం ప్రాజెక్టును అడ్డుకుంటూ చంద్రబాబు లేఖ ఇచ్చింది నిజం కాదా అంటూ నిలదీశారు. లేఖ విరమించుకున్నాకే చంద్రబాబు తెలంగాణాలో అడుగు పెట్టాలి అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జీతాలు తీసుకునే ఆశావర్కర్లు, అంగన్ వాడి కార్యకర్తలు వున్నారు. అలాగే రూ.43 వేల కోట్లతో అమలు చేస్తున్న సంక్షేమ పతకాలు ఎక్కడా లేవు. మేం చెప్పేవి అబద్దాలైతే డిపోసిట్ లేకుండా వోడించండి. కులం ముసుగులో వోట్లకి వచ్చే వారికి ప్రజలు చెంప చేలు మనేల సమాధానం ఇవ్వాలి" అంటూ చెప్పుకొచ్చారు