కన్నడ బ్యూటి ప్రేమలో డిఎస్పి

SMTV Desk 2018-11-19 16:53:42  Rock star devi sri prasad, Poojitha, Kannada actress

హైదరాబాద్, నవంబర్ 19: సంచలన సంగీత విద్వంసుడు దేవి శ్రీ ప్రసాద్ ఓ హీరోయిన్ ప్రేమలో పడ్డాడని ఇండస్ట్రీ లో వార్తలొస్తున్నాయి. ఆమెతోనే ఈమధ్య ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ దేవి శ్రీ ప్రసాద్ ప్రేమించే ఆ అమ్మాయి ఎవరు అంటే కన్నడ నటి పూజిత అని తెలుస్తుంది.





తెలుగులో రంగస్థలం సినిమాలో ప్రకాశ్ రాజ్ కూతురిగా నటించింది పూజిత. ఆ సినిమా టైంలోనే ఇద్దరు క్లోజ్ అయ్యారట. ఇప్పుడు పూజితతో డిఎస్పి పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని టాక్. త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై డిఎస్పి నుండి కాని పూజిత నుండి కాని ఎలాంటి క్లారిటీ రాలేదు.

తన మ్యూజిక్ తో అమ్మాయిల మనసులను దోచేస్తున్న డిఎస్పి లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు పడుతుందో చూడాలి. ప్రస్తుతం రాం చరణ్ వినయ విధేయ రామ, మహేష్ మహర్షి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు డిఎస్పి.