మీ టూ పై ఆసక్తికర వాఖ్యలు చేసిన బాలీవుడ్ భామ

SMTV Desk 2018-11-19 16:51:02  Mee too, Preethi jintaa

ముంబై, నవంబర్ 19: మీ టూ పై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా సంచలన వాఖ్యలు చేసింది. తాజాగా బాలీవుడ్ హంగామా అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిధంగా స్పందించింది.





ప్రీతి మాట్లాడుతూ… “మన సమాజంలో మిగతా రంగాలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో లైంగిక దాడులు చాలా తక్కువగా జరుగుతాయి. కొందరు ఆరోపించిన మాత్రాన ఇండస్ట్రీని తప్పుబట్టడం ఏం బాలేదు. నాకు వొక మీటూ కథ ఉంటే బావుండు దీని మీద ఇంకా ఎక్కువగా స్పందించేదాన్ని… అవకాశాలు వచ్చిన సమయంలో స్వీటు అవకాశాలు రానప్పుడు మీటుగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త” అంటూ హాస్యంతో స్పందించింది. ఈ కామెంట్ల మీద నెటిజన్లు మండిపడుతున్నారు. వొక స్త్రీ అయి ఉండి స్త్రీల ఉద్యమం పట్ల ఇలాంటి హాస్యాస్పద కామెంట్స్ చేయడం సబబు కాదని హితవు పలుకుతున్నారు.