దేశంలోనే మొదటి ఇంజన్ లేని ట్రైన్

SMTV Desk 2018-11-19 16:45:40  Indian railways, Firest engine less tarin, Trian 18

చెన్నై, నవంబర్ 19: భారత దేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత ఇంజనీర్లు అధునాతన ఇంజిన్‌ లేని ట్రైన్‌ను నిర్మించారు. ‘ట్రైన్ 18 అని నామకరణం చేసిన ఈ రైలుని సకల సదుపాయాలతో రూపొందించి. ఇటీవలే ట్రయిల్ రన్‌ని కూడా విజయవంతం చేశారు. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీనిని రూపొందించింది. ఇప్పటివరకు మన దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్ శతాబ్దికి దీనిని సక్సెసర్‌గా అభివృద్ధి చేసారు. ఆదివారం ఉదయం మొరాదాబాద్-రాంపూర్ సెక్షన్‌లో ‘ట్రైన్ 18 కు ఉత్తర రైల్వే ట్రయల్ రన్ నిర్వహించింది. వివిధ వేగాల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమైనట్టు అధికారులు తెలిపారు. తొలుత గంటకు 30 కిలోమీటర్లు, తర్వాత 50, అనంతరం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ నిర్వహించారు. అలాగే, బ్రేకుల పనితీరును కూడా పరీక్షించినట్టు అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ డీపీ సింగ్ తెలిపారు. ‘ట్రైన్ 18 లో డ్రైవింగ్ కోచ్‌తో కలిపి మొత్తం 16 బోగీలు ఉంటాయి. బేబీ కేర్ కోసం ప్రత్యేక సదుపాయం, డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్లు, ప్రత్యేక ప్యాంట్రీ కార్లు ఉన్నాయి. అలాగే, ప్లాట్‌ఫాంలో రైలుకు ముందు వెనక సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చారు. డోర్లు మూసివేసే ముందుకు ప్రయాణికులను డ్రైవర్ గమనించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్న ఇలాంటి ట్రైన్‌లను భారత్‌కు కూడా రూపొందించే సత్తా ఉందని ప్రపంచానికి చెప్పిన వాళ్ళం అవుతామని రైల్వే అధికారులు భావిస్తున్నారు.