చపాతీలు గుండ్రంగా లేవని భార్యను చంపిన భర్త

SMTV Desk 2017-07-24 14:17:16  Chapati was the husband who killed his wife who was not rounded

న్యూఢిల్లీ, జులై 24 : భార్య చేసిన చపాతీలు గుండ్రంగా లేవని ఓ దుర్మార్గపు భర్త తన భార్య గర్భవతి అని జాలి లేకుండా అతి దారుణంగా చంపిన ఘటన ఢిల్లీ లోని జహంగీర్‌పురి లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఢిల్లీ కి చెందిన సిమ్రాన్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి ఈమెకు 5 సంవత్సరాల పాప కూడా ఉంది. భర్త ఇంటికి రాగానే చపాతీలు వడ్డించింది. అవి గుండ్రంగా లేవని సిమ్రాన్ పై చేయిచేసుకున్నాడు. ఆమె గర్భవతి అన్న జాలి కూడా లేకుండా పలు మార్లు కడుపులో తన్నాడు. అమ్మను కొట్టవద్దంటూ అడ్డుకోవడానికి వెళ్ళిన తన కూతురిని వేరే గదిలో పడేసి తాళం వేసాడు. తరువాత ఇంట్లో నుంచి పారిపోయాడు. 4 గంటలకు సిమ్రాన్ సోదరుడు ఇంటికి వచ్చేసరికి ఆమె నిర్జీవంగా పడి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ గదిలో ఉన్న చిన్నారిని బయటకు తీసుకువచ్చి అన్ని విషయాలు అడిగారు. ఆ చిన్నారి అమ్మ నాన్నలు ఎప్పుడు గొడవ పడుతుంటారని, ఇదే విషయమై నాన్న అమ్మను చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారిని బంధువుల ఇంట్లో ఉంచి నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.