అమృత్‌సర్‌లో బాంబు పేలుడు

SMTV Desk 2018-11-18 15:47:24  Punjab, Bomb blast, Amritsar,

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి బాంబు విసిరి పారిపోయారు. రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.గాయపడిన వారిని అమృత్‌సర్‌లోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు.

కొన్ని వారాల క్రితం పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోనూ ఇలాంటి దాడే జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు పోస్ట్‌పై గ్రెనేడ్ విసిరి వెళ్లారు.

ఈ నేపథ్యం లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇది చాలా దురదృష్టకర ఘటనని పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తంపై అనుమానాలు వ్యక్తం చేశారు.ఉగ్రవాద వ్యాప్తికి ఖలిస్థానీలను ఐఎస్ఐ ఎగదోస్తోందని ఆయన ఆరోపించారు. ఖలిస్థాన్‌కూ, ఐఎస్ఐకూ సంబంధాలున్నాయని అన్నారు. కాగా, దాడి ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్య చికిత్స జరిపిస్తామని ప్రకటించారు.