ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్త

SMTV Desk 2018-11-18 15:32:56  Prabhas, Sujeeth, Saaho, Saaho movie release date

హైదరాబాద్, నవంబర్ 18: తెలుగు అభిమానులే కాకుండా యావత్ దేశం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సాహో . బాహుబలి సిరీస్ తరువాత మల్లీ అదే రేంజ్ భారీ బడ్జెట్ తో రాబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్ . రన్ రాజ రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభమై వొక సంవత్సరం కంటే పైనే అవుతుంది కాని ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు. ఈ మధ్యే అభిమానుల కోరిక మేరకు దుబాయ్ లో జరిగే ఫైట్ సన్నివేశ మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో అనే పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో అభిమానులని మరింత ఉర్రూతలూగించేల వుంది. అదికాకుండా వొక కొత్త రికార్డును కూడా నమోదు చేసింది. కేవలం మేకింగ్ వీడియో కి 10 మిల్లియన్ ల పైనే వ్యూస్ రావడం ఇదే మొదటిసారి.




ఇక ఈ సినమా విడుదల డేట్ విషయానికొస్తే 2019 ఆగస్ట్ 15 న మొహూర్థం ఖారారు చేశారు. సినిమా కి ఇంకా విఎఫ్ఎక్ష్, సిజి పనులు కావాల్సింది చాలా వున్నాయి. కావున మేకర్స్ మాత్రం ఎలాగైనా ఇవన్నీ అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఖాయం చేశారు అభిమానులకు ఇది చాలు. కేవలం మేకింగ్ వీడియో నే రికార్డు ను సృష్టిస్తే ఇక సినిమా ఏ రెంజే లో రికార్డులు తిరగ రాస్తుందో చూడాలి.