ఫైనల్ లో భారత్ ఓటమి

SMTV Desk 2017-07-24 13:35:16  India, lost, in, final

లండన్, జులై 24 : ఈ సారి నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలతో ఛాంపియన్స్ లోకి అడుగు పెట్టిన భారత మహిళ క్రికెట్ టీం చివరి వరకు పోరాడి ఓడిపొయింది. లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 228 పరుగులు లక్ష్య ఛేదనలో భారత్‌కు బరిలోకి దిగింది. పునమ్ రౌత్, స్మృతి మాంధాన ఒపెనర్స్ గా బ్యాటింగ్ వచ్చారు. అయితే ఆరంభంలోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. స్మ్కృతి మాంధాని డౌకౌట్‌ అయ్యారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మిథాలి రాజ్ కుడా 17 పరుగులు చేసి రనౌట్ అయ్యారు. తరువాత బ్యాటింగ్కు వచ్చిన హర్మాన్ ప్రీత్, పునమ్ రౌత్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. పునమ్ రౌత్ 86 పరుగులు, హర్మాన్ ప్రీత్ 51 పరుగులు, వేద 35 పరుగులతో రాణించారు. ఆ తరువాత వచ్చిన బ్యాట్‌మెన్స్ వరుసగా వెనుదిరిగారు. 219 పరుగులు చేసి చివరి వరకు పొరాడి భారత్ ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 228 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సారా టేలర్ 45, సైవర్‌ 51, బ్రంట్ 34 పరుగులతో రాణించి ఛాంపియన్స్ ట్రోఫి విజేత గా నిలిచింది. ఇంగ్లాండ్ ఇంతకు ముందు 1973, 1993, 2009లలో విజేతగా నిలిచింది.