నయన్ చిత్రానికి అనిరుధ్ స్వరాలు

SMTV Desk 2017-07-24 13:33:19  anirudh, nayanataara, movie, dark movie, lady oriyented movie

చెన్నై, జూలై 24 : కథానాయికలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలలో నటిస్తూ కథానాయకులకు పోటీగా దూసుకెళుతున్నారు నయనతార. అనామికా, మాయా, డోరా వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడమే కాక మరోవైపు యువ హీరోలతో కూడా జోడీ కడుతున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘వేలైక్కారన్‌’, ‘ఇమైకా నొడిగల్‌’, ‘అరం’, ‘కొలైయుదిర్‌ కాలం’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాగా నయనతార మరో నాయిక ప్రాధాన్యం ఉన్న ‘కోకో’ అనే కొత్త సినిమాలో నటించనున్నారు. డార్క్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఈ మూవీతో నెల్సన్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మరో రెండు వారాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నట్లు సమాచారం.