విశాఖలో ధోని క్రికెట్‌ అకాడమీ

SMTV Desk 2018-11-17 19:06:30  MS Dhoni, Cricket acadamy, Andrapradesh, Vishakhapatnam

విశాఖపట్టణం, నవంబర్ 17 : భరత క్రికెట్‌ కెప్టన్ మహేంద్రసింగ్‌ ధోని ఏపి ప్రభుత్వంతో విశాఖలో క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయడానికి వొప్పందం కుదుర్చుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. ఇందులో భాగంగా ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో వొప్పందం కుదుర్చుకున్నారు. వొప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు.