కోదండరాం ఇంటి ముందు దర్నాకి దిగిన ప్రముఖ పార్టీ నేతలు

SMTV Desk 2018-11-17 18:03:09  Prof. Kodandaram, TJS, Telangana elections, Election ticket, Miryalaguda constituency

హైదరాబాద్, నవంబర్ 17: టీజేఎస్ అధినేత కోదండరాం తనకు కేటాయించిన జనగాం టికెట్ ను పొన్నాల లక్ష్మయ్య కు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతనికి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. మిర్యాల‌గూడ టికెట్‌ను తన కొడుకు రఘువీర్‌రెడ్డికి ఇప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో మంతనాలు సాగించారు తండ్రీ కొడులు దీంతో అది రఘువీర్‌కు దక్కుతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సీటును ఆశిస్తున్న టీజేఎస్ నేత విద్యాధర్‌రెడ్డికి ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అనుచరులు సికింద్రాబాద్ తార్నాకలోని కోదండరాం ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. మిర్యాలగూడ సీటునువిద్యాధర్ రెడ్డికే కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారికంగా వొక్క స్థానాన్ని కూడా ప్రకటించకముందే టీజేఎస్‌లో సీట్ల పంచాయతీ మొదలవడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే ఉంది.

వొక కుటుంబానికి ‘వొకే టికెట్ విధానాన్ని పాటిస్తున్నామని కాంగ్రెస్ పైపైకి చెబుతున్నదాని ప్రకారం చూస్తే జానారెడ్డి కుమారుడు సీటు దక్కనట్లే.. వొక వేళ ఆ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తే సన్నిహితుడైన విజయేందర్ రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి పట్టుబట్టి కూర్చున్నట్లు సమాచారం. అలా జరక్కపోతే తాను మిర్యాలగూడలో టీజేఎస్ విజయానికి సహకరించబోనని ఢిల్లీ పెద్దలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.