అమెరికాలో దుండగుడి కాల్పుల్లో తెలంగాణ వాసి మృతి

SMTV Desk 2018-11-17 17:50:14  America, Gun firing, Edla sunil

న్యూజెర్సీ, నవంబర్ 17: నగర వెంట్నార్ సిటీలో నివాసముంటున్న సునీల్‌ ఎడ్లను గురువారం ఆయన ఇంటి వద్దే కాల్చిచంపేశాడో టీనేజ్ యువకుడు. విధులు నిర్వహించుకుని ఇంటికొచ్చిన సునీల్‌పై 16 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు. తర్వాత సునీల్ కారును తీసుకుని పారిపోయాడు. అతని వెంట మరో టీనేజర్ ఉన్నట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.మెదక్‌కు చెందిన సునీల్ తన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం త్వరలో భారత్ కు రావాల్సి ఉండగా దారుణం జరిగిపోయింది. బాలుడు సునీల్‌ తలకు గురిపెట్ట కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. నిందితుణ్ని జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు పోస్టు మార్టం జరుగుతుందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. 61 ఏళ్ల సునీల్ పాతికేళ్లుగా నూజెర్సీలో ఉంటున్నారని, ఆయన చర్చీల్లో పాటలు పాడుతుంటారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.