కెకెను పరామర్శించిన కేసీఆర్

SMTV Desk 2017-07-24 13:00:45  k. keshavaravu, health, cm kcr, mahamadhali

హైదరాబాద్, జూలై 24 : కొన్ని రోజులుగా తెరాస రాజ్యసభ ఎంపీ కె. కేశవరావు మూత్ర సంబంధిత సమస్య, జ్వరంతో బాధపడుతూ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కెకెను సోమవారం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ వైద్య సంచాలకులు డాక్టర్ మనోహర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, నేతలు తదితరులు ఉన్నారు.