హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్

SMTV Desk 2018-11-16 19:09:18  Allari Naresh, G.nageswar reddy, Maharshi

హైదరాబాద్, నవంబర్ 16: సినిమాలో హాస్యం పండించాలి అంటే అది కేవలం అల్లరి నరేష్ వల్లే సాధ్యమవుతుంది. అతను హాస్యంతో అందుకున్న విజయాలు చాల ఉన్నాయి. అయితే కొంతకాలంగా నరేష్ కి సరైన హిట్ రాలేదు. దాంతో అప్పటి నుంచి ఆయన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ మహర్షి సినిమాలో వొక ముఖ్యమైన పాత్రను పోసిస్తున్నాడు .ఇక ఈ తరహా పాత్రలనే చేస్తాడేమోనని అనుకున్నవారు కూడా ఉన్నారు.

కానీ తాను హీరోగా కొనసాగాలనే పట్టుదలతోనే అల్లరి నరేశ్ వున్నాడు. త్వరలో జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ తో వొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. త్వరలోనేఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారట. ఈ సినిమాతోనైనా అల్లరి నరేశ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.