బాలీవుడ్ లోకి ప్రముఖ సంచలన దర్శకుడు

SMTV Desk 2018-11-16 18:09:12  Bollywood, Pa. Ranjith, Birsa munda

ముంబై, నవంబర్ 16 : తమిళంలో సూపర్ స్టార్ తో కబాలి, కాలా లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు పా. రంజిత్ ఇప్పుడు బాలీవుడ్ లో ప్రవేశించడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇండియన్ సినీ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేసి తెలిపాడు. పా రంజిత్ ఉత్తరాది గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవితాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఈ చిత్రాన్ని బియాండ్ ది క్లావ్డ్స్ అనే చిత్రాన్ని నిర్మించిన నామా సంస్థ నిర్మించనుందట. నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.





మన తెలుగు రాష్ట్రాలకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎలానో జార్ఖండ్ ప్రజలకు బిర్సా ముండా. 19 వ శతాబ్దపు చివర్లో ఆంగ్లేయులపై పోరాటం చేసి యుక్త వయసులోనే వీరమరణం పొందాడు బిర్సా ముండా. ఆయన ఉద్యమ ప్రభావం కేవలం జార్ఖండ్ రాష్ట్రానికి పరిమితం కాకుండా చుట్టూ ప్రక్కల ఉన్న బీహార్, పశ్చిమ బెంగాల్, వొడిశా రాష్ట్రాలలో కూడా ప్రభావం చూపింది.