డిసెంబర్ 7 న 'కవచం'

SMTV Desk 2018-11-16 17:37:09  Bellam konda srinivas, kajal, mehrin

హైదరాబాద్, నవంబర్ 16: బెల్లంకొండ శ్రీనివాస్ ,శ్రీనివాస్ మామిళ్లడైరెక్షన్ లో 'కవచం' సినిమా నిర్మించబడింది . ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ మరియు మెహ్రీన్ నటించారు. ఇదివరకే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాను యూత్ కి మరింత చేరువగా తీసుకెళుతుందని అంటున్నారు. సాక్ష్యం నిరాశ పరచడంతో, బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.