వేణుమాధవ్ కి ఆదిలోనే చుక్కెదురు

SMTV Desk 2018-11-16 17:30:50  Venumadhav, Telangana assembly election, Nomination

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ ఎన్నికల బరిలోకి దిగితున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సూర్యాపేట జిల్లాలో కోదాడ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురైంది.ఆయన నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు వాటిలో లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. మరిన్ని వివరాలు కావాలంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో వేణు నిరాశకు గురయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సరైన పత్రాలు తీసుకుని రేపుగాని, ఎల్లుండిగాని నామినేషన్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. వేణు స్వస్థలం కోదాడ కావడంతో ఆయన ఇక్కడి నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అనారోగ్యం వల్ల వేణు మాధవ్ సినిమాలకు దూరమయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.