బాబు నిర్ణయంపై మండిపడుతున్న పార్టీ సీనియర్ నేతలు

SMTV Desk 2018-11-16 17:12:16  Chandrababu, Nandamuri suhasini, TDP, Kookatpally party ticket

హైదరాబాద్, నవంబర్ 16: మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నందమూరి వారసురాలైన నందమూరి సుహాసిని కి కూటమిలో పొత్తులో భాగంగా కూకట్‌పల్లి టికెట్‌ను టీడీపీకి కేటాయించిన విషయం తెలిసిందే. కాని ఇదివరకు ఈ టికెట్ ను టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డికి కేటాయిస్తుందని ప్రచారం జరిగింది. ఊహించని విధంగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు తెరమీదికి వచ్చింది. నిన్ని విశాఖలోని నోవాటెల్ హోటల్లో సుహాసిని, చంద్రబాబు నాయుడు సమావేశం కూడా అయ్యారు. తర్వాత ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. కానీ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో కూకట్‌పల్లి కాంగ్రెస్ రెబల్ నేతలు గుర్రుగా ఉన్నట్టు ఉన్నారు.

ఈరోజు కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌ 1లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ ఈ సీటుని పెద్దిరెడ్డికి కేటాయిస్తుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా సుహాసిని పేరుని తెరపైకి తీసుకొని వచ్చి హరికృష్ణ మృతికి సానుభూతి పొందాలనుకుంటున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, అయినా పొత్తు కోసం పెద్దిరెడ్డికి మద్దతివ్వాలని అనుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అసలు తెలియని సుహాసిని మాపై రుద్దారు. అసలు ఆమెకు కూకట్ పల్లి గురించి ఏం తెలుసు? హరికృష్ణకు పుట్టడమే ఆమె గొప్పా? చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిది. లేకపోతే కాంగ్రెస్ తరపున వొక రెబల్ అభ్యర్థిని రంగంలోకి దింపి సుహాసినిని చిత్తుగా ఓడిస్తాం.. అని హెచ్చరిస్తున్నారు.