మహిళల అఘాయిత్యాల నివారణకై కొత్త చట్టాలు

SMTV Desk 2018-11-16 16:17:12  

మహారాష్ట్ర, నవంబర్ 16: మహిళల పై అఘాయిత్యాలు నివారించడానికి చట్టం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నియమాలను శ్రుష్టిస్తుంది. అయితే బీడ్ ప్రాంతానికి చెందిన పురుషోత్తం వీర్ అనే 24 ఏళ్ల కుర్రాడు 2017 ఏప్రిల్ 20న వొక పదహారేళ్ళ బాలికకు కన్నుకొట్టి ఆమెను తదేకంగా చూశాడు. అతని చూపు చేష్టలతో విసుగుచెందిన సదరు బాలిక తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు పురుషోత్తంను అదుపులోకి తీసుకొని ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేసి పోస్కో ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఈరోజు తీర్పు వెలువరించిన మరఠ్వాడా కోర్టు పురుషోత్తంకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించింది. దీంతో కోర్టులోనే ఉన్న పురుషోత్తం కన్నీరు మున్నీరయ్యాడు.

చట్టం ప్రకారం :

ఎవరైనా మహిళను 14 సెకండ్ల కంటే ఎక్కువ సమయం చూస్తే, చూసే వారి చూపులను మహిళలు ఇబ్బందిగా ఫీల్ అయితే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టె అవకాశం ఉంది. ఈ చర్యలకు సదరు పురుషులకు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది...