అక్షయ్ ట్విట్టర్ లో రోబో 2.O కొత్త పోస్టర్

SMTV Desk 2018-11-16 14:48:16  Robo 2.O, Akshay kumar, Rajinikanth, Shankar

ముంబై, నవంబర్ 16: ఈ నెల విడుదలకి సిద్దంగా ఉన్న చిత్రం రోబో 2.O. శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్నఈ చిత్రం వీళ్ళ కాంబినేషన్ లోనే 2010 లో వచ్చిన రోబో కి సీక్వెల్ గా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌ను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్ పై భాగంలో క్రోమ్యాన్ అక్షయ్ కుమార్ ఉంటె.. కింద చిట్టి రోబోలు గ్లోబ్ ఆకారంలో అనేకం ఉంటాయి. ఈ పోస్టర్ చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. తీవ్రంగా ఉంటె కనులుకలిగిన అక్షయ్ కుమార్ థియేటర్లో భయపెట్టడం ఖయం అని సినీపండితులు అంటున్నారు.
సైంటిఫిక్ నేపథ్యంలో సాగే సినిమా అయినప్పటికీ ఊహకు అందని ఊహాతీతమైన శక్తులు కూడా ఇందులో ఉండబోతున్నాయని సమాచారం. ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.