'మీ టూ' పై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ నటి

SMTV Desk 2018-11-16 14:10:44  Mee too, Radhika aapte

ముంబై, నవంబర్ 16: ప్రస్తుత సమాజంలో కలకలం రేపుతున్న మీ టూ ఉద్యమం గురించి తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మహిళలు ముందుకు వచ్చి మగవారు వారిపై గతంలో పాల్పడిన అత్యాచారాలను, లైంగిక వేధింపులను బయటపెడుతున్నారని, అయితే వాటికి ఆధారాలు అడగకూడదని ఆమె స్పష్టం చేసారు.





‘కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం, ఆఫీస్‌లో ఉద్యోగం కోసం మహిళను లైంగికంగా లోబరచుకుంటున్నారు అని ఆమె ఆరోపించారు. సమాజాన్ని మార్చాల్సిన మీడియా సంస్థలలోని ఉద్యోగులు కూడా మీటూ ఆరోపణలు ఎదురుకోవడం బాధాకరమని తెలిపారు. అయితే ఇలాంటి సంఘటనలను ఆధారాలతో బయటపెట్టడం కష్టమని స్పష్టం చేశారు రాధిక. తాను కూడా సినిమా అవకాశాల కోసం తిరిగిన రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎదురుకున్నానని రాధిక పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే రాధికా ఆప్టే సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతకు సుపరిచితురాలు. దీని గురించి ప్రశ్నించగా “నా శరీరం నా ఇష్టమంటూ” ఘాటుగా స్పందించారు.