వచ్చే దీపావళికి విజయ్ సినిమా

SMTV Desk 2018-11-16 13:16:44  vijay, samantha, Nayanatara, Music director AR Rehaman

హైదరాబాద్, నవంబర్ 16: విజయ్ హీరోగా ప్రేక్షకుల ను ఎంతగానో అలరించిన సర్కార్ .. విడుదలైన ప్రతి చోట విజయవంతం అయి . కొత్త రికార్డులను అందుకుంది . అలాగే ఈ సినిమా సక్సెస్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తుండగానే, విజయ్ తన తరువాత సినిమాపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా అట్లీ కుమార్ డైరెక్టన్ లో రానుంది .

ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి . త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది విజయ్ కి 63వ సినిమా .. ఈ కథ క్రీడా నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇదివరకే వీరి ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మెర్సల్ 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అందువలన మరోసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.హీరోయిన్ గా సమంత .. నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చనున్న ఈ సినిమాను, వచ్చే దీపావళికి విడుదల చేయనున్నారు.