గిన్నిస్ బుక్ లో తెలంగాణ వారసుడు

SMTV Desk 2018-11-16 12:44:12  Ginnis book, World record, Dentist, Mettu srikanath

హైదరాబాద్, నవంబర్ 16: నగరానికి చెందిన దంత వైద్యుడు, తెలంగాణ రాష్ట్ర డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టు శ్రీకాంత్ వొకే 8 వేల మంది నిరుపేద విద్యార్థులకు దంత వైద్య చికిత్సలు, అవసరమైన వారికి సర్జరీలు నిర్వహించి వరల్డ్‌ రికార్డు సాధించారు. తన తల్లి పేరుమీద ఏర్పాటు చేసిన చంద్రవతి ట్రస్టు ఆధ్వర్యంలో కేవలం దంత చికిత్సలు మాత్రమే కాకుండా విద్యార్థులందరికి టూత్‌పేస్టులు, బ్రష్‌లు, పంటినొప్పికి సంబంధించిన మందులను ఉచితంగా అందజేశారు. వొకే రోజు ఎనిమిది వేల మంది విద్యార్థులకు దంత పరీక్షలు, ఆపరేషన్లు చేసిన శ్రీకాంత్ సదరు వివరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారికీ పంపించడం జరిగింది. అంత మందికి వొక్కరోజులో దంతవైద్య పరీక్షలు నిర్వహించిన సంఘటనలు ఇంతవరకు లేకపోవడంతో మెట్టు శ్రీకాంత్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో స్థానం కల్పించారు. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు చైర్మన్‌ అలీ స్టే రిచార్ట్‌ చేతుల మీదుగా మెట్టు శ్రీకాంత్‌ ఈ అవార్డును అందుకున్నారు.