ముంబైలో ఘోర సంఘటన

SMTV Desk 2018-11-16 12:33:17  Mumbai, Baby sitters, Womens

ముంబై, నవంబర్ 16: నగరలోని ట్రాంబే ప్రాంతంలో వొక అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రిజ్వానా బేగం(36) అనే నిందితురాలు నాలుగేళ్ళ చిన్నారిని అత్యంత దారుణంగా కొట్టింది. పాప బాధతో కొట్టొద్దని ఎంత వేడుకున్నా వినకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. కాళ్ళతో తన్నింది. అంతటితో ఆగకుండా పాప మీద ఊపిరి ఆడకుండా కూర్చుంది. లిఫ్టులో వస్తున్న అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలైన పాపను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వద్ద పాప చెవిరింగులు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.