ఖైరతాబాద్ గణేషుని చేతిలో లడ్డూ లెనట్టేనా.. ?

SMTV Desk 2017-07-23 16:23:47  This, time, Laddu, Lentatna, at, the, hands, of, Khairatabad, Ganesh

హైదారాబాద్, జులై 23 : మనకు వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ లో కొలువుతీరే భారీ గణేషుడు అనడంలో ఎలాంటి సందేశం లేదు. ఇక ఖైరతాబాద్ గణేషుని చేతిలో కనిపించే మహ లడ్డూ ప్రసాదం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ లడ్డూను తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరానికి చెందిన సురుచి స్వీట్స్ యజమాని మల్లికార్జునరావు నేతృత్వంలో దాదాపు నెల రోజుల పాటూ ఈ లడ్డూ తయారు చేస్తారు. గణేషుని నిమర్జనం రోజు వరకూ వినాయకుడి చేతిలో ఉండే ఈ లడ్డూ ను ప్రసాదంగా అందుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. ఈ సంవత్సరం మాత్రం గణేషుని చేతిలో లడ్డూ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లడ్డూను భక్తులకు పంపీణీ చేసే రోజున వస్తున్న సమస్యల కారణంగా ఒరిజినల్ లడ్డూను స్వామి ఎడమ చేతిలో నిలిపే విషయాన్ని పునరాలోచిస్తున్నట్లు ఖైరతాబాద్ విఘ్నేశ్వర కమిటీ తెలిపారు. లడ్డూ స్థానంలో బరువు తక్కువగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డూను నిలిపే అవకాశాలు ఉన్నాయని కమిటీ అర్గనైజింగ్ సెక్రెటరి ఎస్ రాజ్‌కుమార్ వెల్లడించారు. మల్లికార్జునరావు 2015 నుంచి ఈ లడ్డూను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ లడ్డూ వెలం పాట సమయంలో భక్తులపై లాఠీచార్జ్ చేయడంతో పోలీసులపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇక గత సంవత్సరం లడ్డూ పరిమాణాన్ని తగ్గించి 500 కిలోల లడ్డూను మాత్రమే స్వామి చేతిలో ఉంచారు. ఈ సారి అది కూడా ఉన్నట్లు కనిపించడం లేదు.