పార్లమెంట్ లో లోదుస్తలను ప్రదర్శించిన సభ్యురాలు : వైరల్ ఫోటో

SMTV Desk 2018-11-15 17:20:28  Irland parlament, Membar of parlament, Showing inners

ఐర్లాండ్, నవంబర్ 15: ఐర్లాండ్ పార్లమెంట్ లో మహిళల మీద అఘాయిత్యాల పై నిరసన తెలుపుతూ పార్లమెంట్ సభ్యురాలైన రూత్ కోపింగేర్ “లేసీ తంగ్ అండర్ వేర్”ని ప్రదర్శించింది. అనంతరం తన తీరుని చూసి పార్లమెంట్ లోని సభ్యులందరూ అవాక్కయ్యారు. అయితే ఐర్లాండ్ లో 27 ఏళ్ల యువకుడు 17 ఏళ్ళ అమ్మాయిని మానభంగం చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్ట్ ఆ యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఇందుకు కారణం రేప్ జరిగిన సమయంలో ఆ అమ్మాయి అశ్లీలంగా కనిపించే అతి పల్చని “లేసీ తంగ్” అనే అండర్‌వేర్ ధరించి ఉండడం. దీనిని కారణంగా చూపి కోర్ట్ ఆ యువకుడిని నిర్దోషిగా విడుదల చేయడంతో ఐర్లాండ్ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతోన్నాయి. ఎందరో యువతి యువకులు అత్యాచారాల కేసులలో బట్టలు ప్రామాణికం కావంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రూత్ ఈ అండర్ వేర్‌ని ప్రదర్శిస్తోన్న సమయంలో పార్లమెంట్ కెమెరాలను కట్టివేయడాన్ని ఆమె తప్పుడబడుతూ మరుసటిరోజు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునించింది.

అండర్ వేర్‌ని ప్రదర్శిస్తోన్న సమయంలో పార్లమెంట్ కెమెరాలను మూసివేసినందుకు గాను అనంతరం తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో “లేసీ తంగ్ అండర్ వేర్”ని పోస్ట్ చేసింది