జ్యోతికకు ఫిదా అయినా మంచు లక్ష్మి

SMTV Desk 2018-11-15 16:18:29  manchu lakshmi, jyothika , katrin moli

హైదరాబాద్ , నవంబర్ 14: నటిగా మంచి పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఇతర భాషా చిత్రాల్లోను చేయడానికి ఆమె ఉత్సాహాన్ని చూపుతోంది. ఇందువల్లనే ఆమె తమిళంలో వొక సినిమా చేస్తోంది .. ఆ సినిమా పేరే కాట్రిన్ మొళి . జ్యోతిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం లో మంచు లక్ష్మి వొక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.

ధనుంజయన్ - గోవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకుడిగా చేశాడు . ఈ సినిమాను గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ .. " జ్యోతిక మంచి నటి .. ఎలాంటి పాత్రలు అయినా ఆమె తన కళ్లతోనే పలికిస్తుంది. పాత్రలో ఆమె చేసిన విధానం నాకెంతో నచ్చింది. కనుక ఆమెతో కలిసి పనిచేయడం నాకు చాల సంతోషంగా వుంది . ఈ సినిమాలో జ్యోతికతో కలిసి పని చేసినప్పటి నుండి . నేను ఆమెకి అభిమాని అయిపోయాను" అని వెల్లడించింది.