స్టార్ హీరోయిన్ ని వద్దంటున్న ప్రముఖ హీరో

SMTV Desk 2018-11-15 10:52:21  Gopichand, Ileana,

హైదరాబాద్, నవంబర్ 15: మాన్లీ స్టార్ గోపిచంద్ కెరియర్ అయోమయంలో పడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగినట్టుగా విజయాలను అందుకోవడంలో విఫలమవుతున్న గోపిచంద్ ఇప్పుడు వరుసగా 3 సినిమాలను లైన్ లో పెడుతున్నాడట. సంపత్ నంది, గోపిచంద్ మలినేనితో పాటుగా తమిళ దర్శకుడు తిరు డైరక్షన్ లో కూడా గోపిచంద్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

తిరు సినిమానే ముందు మొదలవుతుందని తెలుస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో పరిచయం ఉన్న ఇలియానాని హీరోయిన్ గా అనుకున్నారట. అయితే గోపిచంద్ మాత్రం ఇల్లి బేబ్ ను రిజెక్ట్ చేశాడట. ఇలియానా వద్దు వేరే ఇంకెవరినైనా చూడమని చెప్పాడట గోపిచంద్. రవితేజ లాంటి హీరోనే ఇలియానాతో సినిమా చేస్తే చేశాడు కాని గోపిచంద్ ఎందుకు ఆమెను వద్దన్నాడో తెలియట్లేదు. వొకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా గోపిచంద్ సరసన ఆమె చేయనని చెప్పి ఉండొచ్చు అందుకే గోపిచంద్ ఇప్పుడు ఆమెను కాదంటున్నాడని అంటున్నారు. మరి గోపిచంద్ తిరు కాంబినేషన్ లో హీరోయిన్ గా ఎవరు లక్కీ ఛాన్స్ అందుకుంటారో చూడాలి.