నా కూతురు అందరికంటే గొప్ప

SMTV Desk 2018-11-14 18:32:29  

హైదరాబాద్ ,నవంబర్ 14: ఎవరి పిల్లలు వారికీ ముద్దు . పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులకు ముద్దే. ఈ విషయంలో ప్రముఖులు కూడా మినహాయింపుకాదు. ఇదే విషయాన్నిగుర్తు ఉంచుకుని శరీర రంగును బట్టి మనిషి ప్రవర్తను అంచనా వేయద్దంటున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌. కోల్‌కోతాలో జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి వచ్చిన ఆయన అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడారు.

‘మనిషి శరీర రంగును బట్టి వారిని అంచనా వేయకూడదు. ఫలానా మనిషి పొడవుగా ఉన్నాడు. అతడి జుట్టు బాగుంది. చూడటానికి హ్యాండ్సమ్‌గా కనిపిస్తాడు కాబట్టి అతడు గొప్ప వ్వక్తులు అని కాకుండా . దాని వెనక వారి మనసును, వారి కష్టాన్ని కూడా చూడాలి. చిన్నప్పుడు నేను నాకిష్టమైన వారి పోస్టర్‌లను నా గదిలో పెట్టుకునేవాడిని . ఇప్పుడు నా ఫొటోలు అందరూ అంటించుకుంటున్నారు. నేను నటనలో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు . ఏ శిక్షణాలయం నుంచీ రాలేదు. కనుక వొకరి నటనకు నేను తీర్పు చెప్పలేను. ఇక నా కుటుంబం విషయానికొస్తే మేం సాధారణ జీవితం గడుపుతాం. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేనిప్పుడు కావల్సినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. మంచి మనిషి అనిపించుకోకపోతే అవి ఎందుకు ఉపయోగపడవు . శరీర రంగుపై ప్రస్తుతం ఎంతో వివక్ష జరుగుతుంది. నిజంగా చెప్తున్నా నా కూతురు చామన ఛాయలో ఉంటుంది. కానీ ఆమె ప్రపంచంలోనే గొప్ప అందగత్తె. ఈ విషయంలో వేలెత్తి చూపించడానికి లేదు అని షారుక్‌ చెప్పుకొచ్చారు.