మహేశ్‌ కోసం సూపర్ స్టార్

SMTV Desk 2018-11-14 17:06:03  multi flex

హైదరాబాద్‌,నవంబర్ 14: సూపర్ స్టార్ మహేశ్‌బాబు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ను ప్రారంభంచిపోతున్నారు . ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆసియన్‌ సినిమాస్‌తో కలిసి ఆయన ఈ వ్యాపార రంగంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. మహేశ్‌ గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో ‘ఏఎమ్‌బీ‌ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. వాస్తవానికి దీన్ని ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాతో ప్రారంభం చేయాలి అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పుడు ‘2.ఓ సినిమాతో ప్రాంభించాలి అని నిర్వాహకులు భావిస్తున్నారట.

అయితే ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ మేరకు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినిమా థియేటర్‌ ఇదేనంటూ అనేక ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. విలాసవంతంగా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో 7 స్క్రీన్లు ఉన్నాయట. అంతేకాదు ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కల్గించేందుకు లేజర్‌ ప్రొజెక్టర్‌ సిస్టమ్‌ను కూడా ఉంచారట.