ఆ ఊరు మొత్తం సైబర్ నేరగాళ్ళే?!

SMTV Desk 2017-07-23 12:18:24  The, whole, cyber, criminals

జార్ఖండ్, జూలై 23 : దేశంలో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గరున్న డబ్బును మాయం చేస్తున్నారు. జార్ఖండ్ లోని బిన్స్‌మి అనే గ్రామంలో పోలీసులే ఆశ్చర్యపోయే స్థాయిలో సైబర్ నేరగాళ్లు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జార్ఖండ్ లోని బిన్స్‌మి అనే గ్రామంలో వెయ్యి గడపలున్న ఆ గ్రామంలో తొమ్మిది వందల మంది సైబర్ నేరగాళ్లు ఉన్నారు. సైబర్ నేరాల్లో మహమ్మద్ జిలానీ అన్సారి ఆ ఊరు వారందరికీ పెద్ద దిక్కు. అతను రెండు సెల్ ఫోన్లతో ఏకంగా 15 రాష్ట్రాలకు చెందిన ప్రజలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతను రోజుకు రెండు వరకు ఫోన్ కాల్స్ చేస్తాడట. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డుల పాస్‍వర్డు, సీవీవీ నంబరూ చెప్పేలా కొందరినైనా ఒప్పించేలా చేసేవాడట. ఆ సమాచారంతో వారి అకౌంటులోని డబ్బును తన ఈ- వ్యాలెట్ లోకి బదిలీ చేసి తరువాత తన అకౌంటులోకి మార్చుకునేవాడు. పది వేర్వేరు ఈ మెయిల్ ఐడీలతో మొత్తం 34 ఈ-వ్యాలెట్ ఖాతాలు జిలానీకి ఉన్నాయి. నేరస్తుడు ఒక చోట నేరం జరిగేది మరో చోట కావడంతో, ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఏమి చేయలేక పోయేవారు. జిలానీని అదుపులోకి తీసుకున్న తరువాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. 14 మంది సైబర్ నేరగాళ్లు తో కలిసి ఈ రాకెట్ ను నడిపిస్తున్నది టికూమండల్ అనీ, అతనే వాళ్లకి సిమ్ కార్డులు సరఫరా చేస్తాడు. వారు తీసుకున్న డబ్బులో కమీషన్ తీసుకుంటాడనీ, అయితే అతను ఎక్కడుంటాడో వారానికి ఒకసారి వచ్చి ముఠా సభ్యుల నుంచి డబ్బు తీసుకొని మాయమైపోతాడని సైబర్ సెల్ అధికారులు తెలిపారు. ఈ సైబర్ క్రైం నడుపుతున్న టికూమండల్ ని పట్టుకోవడానికి పోలీసులు పథకం వేస్తున్నారని తెలుస్తుంది.