శబరిమల ఆలయ భక్తులకు సవాల్ విసిరిన తృప్తి దేశాయ్

SMTV Desk 2018-11-14 17:05:34  Shabarimala temple, Supreem court, Thrupthi dheshay

కేరళ, నవంబర్ 14: శబరిమల ఆలయ వివాదంపై సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చినా, అక్కడి భక్తులు అడ్డుకోవడంతో మహిళలు వేనుకడుగేస్తున్నారు. అయితే నవంబర్ 17 నుంచి శబరిమలలో ప్రారంభం కానున్న మండల మక్కరవిళ్లక్కు‘ సీజన్ రెండు నెలలపాటు కొనసాగనుంది. భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ శబరిమలకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు.



తనతోపాటు ఏడుగురం 17న శబరిమలకు వెళ్తున్నానని ఆమె వెల్లడించారు. ‘సుప్రీం కోర్టే చెప్పిన తర్వాత మమ్మల్ని అడ్డుకోవడం సరికాదు.. ఇది ప్రజాస్వామ్యం.. మేం కూడా స్వామిని దర్శించుకుంటాం.. అని చెప్పారు. ‘శబరిమలకు వస్తే ముక్కలుముక్కలుగా నరికేస్తామని ఆందోళనకారులు నన్ను బెదించారు. మహారాష్ట్రకు నా శవం వెళ్తుందన్నారు. అలా బెదించేవారు నా దృష్టిలో అసలు అయ్యప్ప భక్తులే కారు. అడ్డుకునే వారు భక్తులు కారు.. . అని మండిపడ్డారు. భక్తుల నుంచి తనకు రక్షణ కావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ కూడా రాసినట్టు వెల్లడించారు. ఇదిలా వుండగా మరో 500 మంది యువతులు కూడా అయ్యప్ప దర్శనం కోసం ఆన్ లైన్ క్యూ వెబ్ సైట్లో రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో అక్కడ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ప్రశ్నగా మారింది.