అనాధ పిల్లలకు తోడుగా ప్రముఖ నటి

SMTV Desk 2018-11-14 16:53:52  Samantha, Prathyusa support, Childs adopting

హైదరాబాద్, నవంబర్ 14: ప్రముఖ నటి అక్కినేని సమంత ‘ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్మించి ఎంతో మంది అనాథ చిన్నారులకు ఆమె ఆసరాగా నిలుస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సనా అనే పసికందు కాలేయం చెడిపోయింది. ఆమెకు కాలేయ మార్పిడి అత్యవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు.





లేదంటే ఆ పాప ప్రాణాలకు ప్రమాదం. సమంత వెంటనే స్పందించింది. తన మిత్ర బృందంతో కలిసి రూ. 15 లక్షలు సేకరించింది. ఆ బిడ్డకు చికిత్స చేయించింది. ఆ డబ్బుతో వైద్యులు సనాకు కాలేయ మార్పిడి చేశారు.



అయితే, దురదృష్టవశాత్తు ఆ పాప చికిత్సకు స్పందించక మరణించింది. సనా మరణవార్త విన్న సమంత సెట్లోనే కన్నీళ్ళు పెట్టుకుంది. ఇంత శ్రమించినా పాప ప్రాణాలు కాపాడుకోలేకపోయామని సమంత చాలా సేపటివరకు బాధపడింది. ఈ విషయాన్ని ప్రత్యూష సపోర్ట్ వాలంటీర్ శశాంక బినేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుపై సమంత స్పందిస్తూ.. సనా చనిపోయిన రోజే తన పుట్టిన రోజని ఆమె గుర్తు చేసింది. ‘ఇప్పటివరకు తాము ప్రత్యూష సపోర్ట్ ద్వారా 547 మంది చిన్నారులను కాపాడాం. సనాను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాం. పాప తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళకు ఎవరి సపోర్ట్ లేదు. సనా చనిపోవడం దురదృష్టకరం అని పేర్కొంటూ శశాంక పోస్టును రీపోస్ట్ చేసింది. ఈ ఘటన సమంత ‘రభస సినిమాలో నటిస్తున్నప్పుడు జరిగింది. ఇప్పుడు తాను తన కుటుంబం నడుపుతున్న ‘హ్యాపీ హోమ్స్‌ అనాథాశ్రమానికి కూడా విరాళాలు సేకరిస్తున్నానని వెల్లడించారు.