సూపర్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిమ్రాన్

SMTV Desk 2018-11-14 15:48:57  rajini kanth, simran , peta,

హైదరాబాద్ ,నవంబర్ 14: .‘పేట' సినిమా కోసం రజనీకాంత్‌ సరసన నటించడాన్ని నమ్మలేకపోతున్నానని నటి సిమ్రన్‌ అన్నారు కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. త్రిష మరో కథానాయిక. విజయ్‌సేతుపతి, బాబిసింహా, శశికుమార్‌, సీనియర్‌ దర్శకుడు మహేంద్రన్‌ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

కాగా ‘పేట ను సంక్రాంతికి విడుదల చేస్తున్నామంటూ తాజాగా చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో రజనీతో సిమ్రన్‌ కనిపించారు. ఇద్దరూ పూల కుండీలు పట్టుకుని సంతోషంగా ఉన్నారు. అంతేకాదు చాలా యంగ్‌ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ను సిమ్రన్‌ సోషల్‌మీడియా షేర్‌ చేశారు. ‘నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఓమై గాడ్‌.. ఇది (రజనీతో కలిసి నటించడం) నిజంగా జరిగిందంటే నమ్మలేకపోతున్నా. నన్ను నేనే గిల్లుకున్నా అంటూ ఆనందంతో చిందులేస్తున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ఈ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది.

రజనీ ఇటీవల ‘కాలా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆకట్టుకున్నారు. ఆయన నటించిన ‘2.ఓ నవంబరు 29న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. దీని తర్వాత తలైవా కొత్త సినిమాకు పచ్చజెండా ఊపారని ఇటీవల ప్రచారం జరిగింది. ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించనున్న సినిమాలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.