అంతిమ పోరుకు రంగం సిద్దం

SMTV Desk 2017-07-23 11:18:52  The, ultimate, battle, field, is, ready

లార్డ్స్, జూలై 23 : అంతిమ పోరుకు రంగం సిద్దమైంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కు భారత్, ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ మూడు సార్లు టైటిల్ ను గెలుచుకుంది. భారత్ ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోపి గెలుచుకున్న ది లేదు. 2005 లో మొదటి సారి ఫైనల్ కు చేరినా, కప్ గెలవలేకపోయింది. మళ్లీ ఇప్పడు 2017 లో ఫైనల్ కు చేరింది. అప్పుడు, ఇప్పుడు మిథాలినే నాయకత్వం వహించింది. గ్రూప్ దశలో ఇంగ్లాండ్‍ను ఓడించి , సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్ చేరుకొని భారత్ మంచి ఫామ్‌లో ఉంది. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని మిథాలి సేన భావిస్తుంది. వంద కోట్ల భారతీయుల కళ్ళు ఆమె మీదనే ఉన్నాయి. సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో హార్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించింది. ఆ మ్యాచ్‌లో కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడి కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. భారత్ జట్టు: మిథాలి రాజ్(కెప్టెన్), హార్మన్ ప్రిత్, పూనం రౌత్, స్మృతి మంధానా బ్యాట్ మెన్స్ జులన్‌ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌, వంటి బౌలర్స్ అద్భుతంగా రాణిస్తుండటం భారత్ కు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్ జట్టు : (కెప్టెన్‌) హెదర్‌ నైట్‌, లారెన్‌ విన్‌ఫీల్డ్‌, టామీ బ్యూమాంట్‌, బ్యాట్ మెన్స్ జెన్నీ గున్‌, లారా మార్ష్‌, వంటి బౌలర్స్ బౌలర్లతో ఇంగ్లాండు కూడా మంచి ఫామ్ లో ఉంది. తాజా సమాచారం ప్రకారం... సెమీ ఫైనల్లో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన హార్మన్ ప్రిత్ ప్రాక్టీస్‍లో గాయపడినట్లు తెలుస్తుంది. గాయపడిన హార్మన్ ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటారా? ఉండరా? అని అభిమానుల్లో సందేహం నెలకొంది. ఐతే కెప్టెన్ మిథాలి రాజ్ మాత్రం హార్మన్ ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో ఆడుతుందని చెబుతున్నారు.