నపుంసకుడు అంటే శిక్ష తప్పదు

SMTV Desk 2018-11-12 19:09:40  Hijra, Nagpur, Highcourt, Andrapradhesh, Wife and husband fighting

నాగ్‌పూర్‌, నవంబర్ 12: నాగ్‌పూర్‌కు చెందినఈ భార్యభర్తల ఎప్పుడూ గొడవపడుతూ వుండేవారు. డానికి ఆమె తన సొంత రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారించిన కోర్టు వారి కుమార్తె బాధ్యతను కొద్దిరోజులు ఆమె భర్తకు అప్పగించింది. దీంతో ఆమె నాగ్ పూర్‌లోని హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. తన భర్త ‘నపుంసకుడ ని అందులో పేర్కొంది.

ఆ మాటకు ఆగ్రహానికి గురైన భర్త ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులపై పరువునష్టం దావా కేసు వేశాడు. అతణ్ణి కించపరచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదని, ఆ కేసును కొట్టివేయాలని భార్య కోర్టును వేడుకుంది. వైద్య చికిత్సలోని అధునాతన పద్ధతి ద్వారా పాప పుట్టిందని కోర్టుకు తెలిపింది. కానీ కోర్టు ఆమె వాదనను కొట్టివేసింది. అది చెప్పేందుకు ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తావని, ఆ పదాన్ని ఉపయోగించి అతడి పరువుకు భంగం కలిగించారని కోర్టు చెప్పింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటామని తేల్చిచెప్పింది.