'కవచం' టీజర్

SMTV Desk 2018-11-12 19:04:43  Bellamkonda srinivas, Srinivas mamilla, Kajal agarwal, Mehreen kaur, Kavacham

హైదరాబాద్, నవంబర్ 12: శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా కవచం. ఈమధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



రిలీజైన టీజర్ చూస్తే రెగ్యులర్ పోలీస్ కథల్లానే అనిపిస్తుంది. పోలీస్ గా బెల్లంకొండ బాబు ఎలా సత్తా చాటుతాడో చూడాలి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వంశధారా క్రియేషన్స్ లో నవీన్ చౌదరి నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా బెల్లంకొండ హీరోకి కమర్షియల్ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. పవర్ ఫుల్ టైటిల్.. పవర్ ఫుల్ టీజర్ తో వచ్చిన ఈ కవచం ఆడియెన్స్ ను అలరిస్తుందో లేదో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.