స్వర్గస్తులైన దాసరి ...దిగ్ర్భాంతికి గురైన సినీ ప్రపంచం

SMTV Desk 2017-05-31 11:04:24  dasari narayanrao,ex ministar dasari ,ex mp dasari died,star director,

హైదరాబాద్, మే31 : సామాన్య,మధ్య తరగతి ప్రజల జీవన విధానాలను తెరకెక్కించి...విశేష ప్రజాదరణను.. మూఠగట్టే దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యం మంగళవారం రాత్రి మృతి చెందారు. తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తు..అత్యధిక చిత్రాల్ని తెరకెక్కించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన ఖ్యాతి అతనిది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అన్న వాహిక, మూత్ర పిండాలు, ఉపరితిత్తుల సమస్యలతో గత కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. జనవరి 19న కిమ్స్ అసుపత్రిలో చెర్పించగా అన్నవాహికకు శస్ర్త చికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత రెండు నెలలకు ఆయన కోలుకున్నారు. మార్చి 29న ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేయగా .. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి మళ్ళి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 17న ఆయనను మళ్ళీ కిమ్స్ లో చేర్పించగా, పరిశీలించిన వైద్యులు అన్నవాహికలో మళ్ళీ సమస్య తలెత్తినట్లు గుర్తించి పునఃశస్ర్త చికిత్స నిర్వహించి.. ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాదాపు పదిరోజులు గడిచినా ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కన్పించక పోవడంతో పాటు మంగళవారం సాయంత్రానికి పరిస్థితి మరింత విషమించింది. రక్తపోటు పడిపోవడం, మూత్రపిండాలు పనిచేయక పోవడం వంటి సమస్యలు తీవ్ర మయ్యారు. డయాలసిస్ అందిస్తు ఆయనను కాపాడేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలితం కన్పించలేదు. చివరికి గుండే వైఫల్యం చెందడంతో మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కీమ్స్ ఆసుపత్రి వైద్యలు ప్రకటించారు. విషయం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నటులు మోహన్ బాబు, తెదేపా తెలంగాణా అధ్యక్షులు ఎల్.రమణ తదితర ప్రముఖులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మోహన్ బాబు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్ శివారు మెయినాబాద్ లోని వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు. # దాసరి ప్రస్థానం: దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్‌ దంపతులకు జన్మించారు. నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. ‘తాతా మనవడు’ చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వంటి అగ్రనటులతో సినిమాలు తీసిన దాసరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌ ఉన్నారు. # దాసరి తీసిన అపురూప చిత్రాలు: నటుడిగా కెరీర్‌ ఆరంభించిన దాసరి దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. ‘తాత-మనవడు’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన ఆయన 150కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ‘దర్శకరత్న’ అనిపించుకున్నారు. ‘శివరంజని’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘ సందేశం’, ‘గోరింటాకు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బలిపులి’ ‘ఒసేయ్‌ రాములమ్మ’ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని అవార్డులు: * దర్శకుడిగా తొలి చిత్రం ‘తాత-మనవడు’(1974)కు నంది అవార్డు. * ‘స్వర్గం-నరకం’ చిత్రానికి బంగారు నంది. * ‘మేఘ సందేశం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు(1982). * మామగారు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు(1992). * ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’ గౌరవ పురస్కారం * 2007లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు. * 2009లో శోభన్‌బాబు తొలి స్మారక పురస్కారం