హారర్‌, కామెడీగా 'టాక్సీవాలా'

SMTV Desk 2018-11-12 15:30:20  Vijay Devarakonda, Taxiwala, Priyanka, Rahul Sankrithyan, Movie Trailer

హైదరాబాద్, నవంబర్ 12: వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండకి ఈ మధ్య వచ్చిన నోటా చిత్రం నిరాశపరిచింది. అయితే నోటా తరువాత ఇప్పుడు‘టాక్సీవాలా తో నవంబర్‌ 17న రాబోతున్నాడు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక నటిస్తోంది. జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్‌కె‌ఎన్ నిర్మించారు . తాజాగాఆదివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.



హారర్‌, కామెడీ, యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింన ఈ సినిమా ట్రైలర్‌లో విజయ్‌ మళ్లీ తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఆ టాక్సీతో విజయ్‌ జీవితంలో వచ్చిన యూ టర్న్స్‌ని సినిమాలో చూడాల్సిందే.