ప్రియాంక, నిక్ ల పెళ్లి ఫోటోల ధర 18 కోట్లు

SMTV Desk 2018-11-12 15:27:24  Priyanka chopra, Nick Jonas, Marrige photos, Jhodh pur Pyales

ముంబై, నవంబర్ 12: ప్రియాంక చోప్రా, నికి జోనస్‌లు ఈ మధ్యే నిచితార్ధం చేసుకొని వివాహం వచ్చే నెలలో జరగబోతున్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. ఈ వివాహానికి దాదాపు 300 మంది విశిష్ట అతిధులు హాజరవుతున్నట్టు సమాచారం. వీరి వివాహానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
సెలెబ్రిటీల ఫోటోలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని ఈ జంట క్యాష్ చేసుకోబోతున్నది. ఓ ప్రముఖ సంస్థకు వీరి పెళ్లి ఫోటోల రైట్స్ ను అమ్మేసినట్టుగా తెలుస్తున్నది. దాదాపు 2.5 మిలియన్ డాలర్లకు అంటే రూ.18 కోట్లకు రైట్స్ ను అమ్మేశారట. ఫోటోలను బయటకు రాకుండా ఆ సంస్థ జాగ్రత పడుతున్నట్టు సమాచారం. ఇలా వచ్చిన ఆ డబ్బును ఓ చారిటి సంస్థకోసం వినియోగించబోతున్నట్టుగా తెలుస్తున్నది.