డ్యుయల్ రోల్ లో సమంత

SMTV Desk 2018-11-11 17:25:26  Samantha Dual role, Samantha,

అక్కినేని కోడలిగా మారాక సమంత సినిమాల సెలక్షన్స్ లో ఆచి తూచి అడుగులేస్తుంది. ఈమధ్య యూటర్న్ అంటూ ఓ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా ఓ సినిమా వస్తుందని తెలిసిందే. నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల బామ్మగా.. 20 ఏళ్ల పడుచు అమ్మాయిగా నటిస్తుందట.

రెండు పాత్రల్లో సమంత అదరగొట్టబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. 70 ఏళ్ల వయసు గల బామ్మ సడెన్ గా 20 ఏళ్ల అమ్మాయిగా మారడంతో ఆమె జీవితం ఎలా మారింది అన్నది సినిమా కథ. ఎస్పి ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందట. మరి ఈ ప్రాజెక్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.