సుబ్బరాజును సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే...

SMTV Desk 2017-07-21 17:55:36  subbaraju in drugs case, drugs, sit,

హైదరాబాద్, జూలై 21: డ్రగ్స్ కేసులో సినీనటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణ ఉదయం 10.15 వద్ద మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిట్ అధికారులు సుబ్బరాజును ఈ క్రింది ప్రశ్నలను అడిగారు. మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? మీరు పూరీ జగన్నాథ్‌కు సన్నిహితంగా ఉంటారా? పూరి ఏ డ్రగ్సైన తీసుకున్నారా? పూరితో బ్యాంకాక్ చేరుకున్నప్పుడు ఏ ఫోన్ నంబర్లు ఉపయోగించారు? పూరీ విదేశీ ఫోన్ నెంబర్లు ఉపయోగించినప్పుడు ... మీకు తెలుసా? మీకు కెల్విన్ తెలుసా? మీరు పూరీ, శ్యాంతో కలిసి కెల్విన్ ను కలిసేవాడివా? మీరు డ్రగ్స్ పార్టీలకు వెళ్తారా? మీరు నేరుగా కెల్విన్ తో వ్యవహరించారా? మీకు కెల్విన్ను ఎవరు పరిచయం చేశారు? చిత్ర పరిశ్రమలో డ్రగ్ అలవాటు ఎవరెవరికి ఉంది? మీ రక్త నమూనాలను, గోళ్ళను, జుట్టును పరీక్షలకు తీసుకోవచ్చా? అని అడిగినట్లు తెలిసింది. కానీ ఈ ప్రశ్నలపై సుబ్బరాజు ఏ సమాధానాలు చెప్పి ఉంటాడోనని పలువురు సినీ ప్రముఖుల్లో గుబులు మొదలైందట.