'సర్కార్' కు కమలహాసన్ మద్దతు

SMTV Desk 2018-11-10 13:52:44  Sarkar, Talapathy Vijay, AR Muragadas, DMK Party

తమిళనాడు, నవంబర్ 10: దీపావళి సందర్భంగా తెలుగు తమిళంలో విడుదలైన సర్కార్ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే అంతే వేగంగా వివదలు కూడా పెరుగుతున్నాయి. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ లో కొన్ని సీన్స్ తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకే పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గొడవలు చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల టైంలో మిక్సీలు, టివిలు లాంటివి ఇవ్వడం ఆ పార్టీ చేసిన కార్యక్రమాలే.

సినిమాలో వరలక్ష్మి పాత్ర పేరుని కోమలవల్లి అని పెట్టారు. అది జయలలిత అసలు పేరు అని.. ఆమెను కించపరచేలా సినిమా ఉందని విమర్శలు చేస్తున్నారు. అన్నాడిఎంకే బెదిరింపులకు తలొగ్గిన సర్కార్ దర్శక నిర్మాతలు సినిమాలో వారు అభ్యంతరం తెలిపిన సీన్స్ కట్ చేశారని సమాచారం. అయితే ఈ వ్యవహారంపై కమల్ హాసన్ స్పందించారు.

విజయ్ సర్కార్ కు సపోర్ట్ గా కమల్ ఈ విషయాన్ని ప్రస్థావించారు. చట్టబద్ధంగా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజైన సినిమాను ఎలా అడ్డుకుంటారని.. ఇలాంటి చర్యలు ఈ ప్రభుత్వానికి కొత్తేమి కాదని కమల్ మండిపడ్డారు. విమర్శలు ఎదుర్కోలేని ప్రభుత్వం కుప్పకూవొలి పోవడం ఖాయమని అన్నారు కమల్ హాసన్. తమిళనాడు రాజకీయ వ్యాపారుల ముఠా మూలాలు నాశనం అవుతాయని అన్నారు కమల్.