జనసేనలోకి మాజీ మంత్రి

SMTV Desk 2018-11-10 11:37:37  Janasena, Pawan Kalyan, pasupuleti balaraju

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా.. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నట్టు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాలరాజు 1987లో ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. జీకే వీధి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాలరాజు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఇవాళ ఉదయం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు పనుపులేటి.