భారత చరిత్రలో మొదటిసారి....తాలిబాన్ తో చర్చలు

SMTV Desk 2018-11-09 18:43:02  Indian History, First time, Thaliban Terrarists, Meeting

మాస్కో, నవంబర్ 09: భారత చరిత్రలో ఎప్పుడు కనీ వినీ ఎరుగని విధంగా తాలిబన్‌ ఉగ్రవాద సంస్థతో భారత్ ప్రభుత్వం తొలిసారిగా చర్చలు జరుపుతోంది. మాస్కోలో జరిగిన చర్చల్లో భారత్‌తో పాటు పాకిస్థాన్, చైనా, అమెరికాలతో పాటు పలు దేశాలు కూడా పాల్గొననున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న ఉగ్ర సంక్షోభాన్ని నివారించడానికే ఈ చర్చలకు పూనుకున్నారు. రష్యన్ ఫెడరేషన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిని నెలకొల్పడం కోసం భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాలిబన్ నేతలతో ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. మరి ఈ చర్చల్లో భారత్ తరఫున అఫ్ఘనిస్థాన్‌లో భారత రాయబారిగా పనిచేసిన అమర్ సిన్హా మాట్లాడనున్నారు. అలాగే పాకిస్థాన్‌లో ఇండియన్ హై కమిషనర్‌గా పనిచేసిన టీసీఏ రాఘవన్‌లు సైతం పాల్గొననున్నారు. పాక్, అప్ఘన్ తదితర దేశాల్లో పట్టుకోల్పోతున్న తాలాబాన్ గత్యంతరం లేని పరిస్థితులో టేబుల్ ముందుకొస్తోంది.