హరీష్ రావు పై మండిపడ్డ ప్రముఖ తెదేపా నేత

SMTV Desk 2018-11-09 17:52:13  Harish Rao, Revoori Prakash Reddy, Congress, TDP, TRS

హైదరాబాద్, నవంబర్ 09: తెలంగాణ మంత్రి, తెరాస నేత హరీష్ రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం అంటూ ప్రముఖ తెదేపా నేత రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో రేవూరి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే బాబు గారు లేఖ ఇచ్చారు అని హరీష్ రావు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా దిగువ రాష్ట్రాల హక్కులు కాపాడుకోవడం కోసం లేఖలు ఇవ్వడం సాధారణం అంటూ కోదండరామ్ లేకపోతే తెలంగాణ వచ్చేద అంటూ నిలదీశారు. సీట్ల విషయానికొస్తే పొత్తులో భాగంగా తెదేపా 14 స్థానాల్లో పోటీ చేయబోతోంది. తెదేపా కి 14 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ చెబుతుంది.