తెదేపా, తెరాస నేతలకు ఈసీ నోటిసులు

SMTV Desk 2018-11-09 17:49:46  Harish Rao, Revanth Reddy, Revoori Prakash Reddy, Onteru Prathap Reddy, TDP, TRS, CEO, Notice

హైదరాబాద్, నవంబర్ 09: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావుకి ఈసీ నోటిసులు పంపింది. ఏపీ ముఖ్యమంత్రి పై అనుచిత వాఖ్యలు చేసినందుకు టిటిడిపి నేతలు ఈసీ కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన అనంతరం హరీష్ రావు కి నోటిసులు పంపి 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాగా టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, వొంటేరు ప్రతాప్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీరికి కూడా ఈసీ నోటిసులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, అలాగే తెరాస నేతలపై పరుష పదాజాలతో దూషించినందుకు గాను వీరిని కూడా 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని సీయివో కోరారు