శబరిమలై లో అంతర్జాతీయ విమానాశ్రయం

SMTV Desk 2017-07-21 17:12:59  shabarimalai, airport, land place

శబరిమలై, జూలై 21 : శబరిమలై వెళ్లే యాత్రికులకు ఓ శుభవార్త. శబరిమలకు సమీపంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను స్థలాన్ని ఎంపిక చేయడానికి ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చెరువ్యాలీ ఎస్టేట్ లో సుమారు 2200 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఇది తేని జాతీయ రహదారి దగ్గర లో ఉంటుంది. రెండు జాతీయ రహదారులకు మధ్యలో ఉండే ఈ విమానాశ్రయం శబరిమలకు 48 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం కొచ్చి తదితర దూర ప్రాంతాలలో విమానాలు దిగడమో, లేక రైలులో సుదీర్ఘ ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా శబరిమలైకి భక్తులు వస్తారు. కేరళలో ఇప్పటి వరకు నాలుగు విమానాశ్రయాలు ఉండగా ఇది ఐదో అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది.