తెలంగాణ జానసమితి పార్టీ కార్యాలయంపై దాడి

SMTV Desk 2018-11-08 16:55:35  Telangana Jana Samithi, Kapilavayi Dilip Kumar, Attacks in Party Office

హైదరాబాద్, నవంబర్ 08: నగరంలోని తెలంగాణ జనసమితి నేత కపిలవాయి దిలీప్ కుమార్ కు చెందిన మల్కజ్ గిరిలో కార్యాలయంలోకి బుదవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి విద్వంసం సృష్టించారు. ఆయన కార్యాలయంలో ఫర్నీచర్, కంప్యూటర్, ఎన్నికల ప్రచారసామాగ్రిని ద్వంసం చేశారు. తెలంగాణ జనసమితి నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.