బిజెపితో చేతులు కలిపిన ప్రముఖ పార్టీ

SMTV Desk 2018-11-08 16:43:16  BJP, Yuva Telangana Party, Elections, Balakrishnareddy, Rani Rudrama Devi, Laxman

హైదరాబాద్, నవంబర్ 08: రానున్న ఎన్నికల్లో భారత జనత పార్టీ రాష్ట్రంలో వొంటరిపోరుకు సిద్దమై 66 మంది అభ్యర్ధుల పేర్లు కూడా ప్రకటించింది. ఈ సమయంలో బిజెపి కి రాష్ట్రంలో వొక కొత్త పార్టీ ఈ పార్టీ తో కూడి పోటీ చేయడానికి సిద్దమయింది. అదే యువ తెలంగాణ పార్టీ. రెండు నెలల క్రితమే కొత్తగా స్థాపించబడిన ఆ పార్టీకి జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షుడు. ప్రముఖ టీవీ యాంకర్ రాణీ రుద్రమదేవి ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. వారు కూడా రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేయాలనుకున్నారు కానీ బిజెపితో పొత్తులు పెట్టుకొనిడి 10 సీట్లతో సర్ధుకుపోవాలని అనుకొంటున్నట్లు తాజా సమాచారం. బిజెపిలో సీట్లకు కరువు లేదు కనుక వారు పోటీ చేస్తామంటే ఆదనంగా మరో 10 సీట్లు ఇవ్వగలదు.





బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “మాతో కలిసి పనిచేయడానికి వచ్చిన యువ తెలంగాణ పార్టీకి సాధారంగా స్వాగతం పలుకుతున్నాము. రాష్ట్రంలో మోడీ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్న తెరాసకు మా చేతిలో ఓటమి తప్పదు. మహాకూటమికి మహా ఓటమి తప్పదు. ఎన్నికల తరువాత తెరాస, మహాకూటమి రెండూ కూడా రాష్ట్రం నుంచి కనబడకుండా మాయం అయిపోతాయి. వొకటి రెండు రోజులలో బిజెపి, యువ తెలంగాణ పార్టీల నేతలు చర్చించుకొని సీట్ల సర్దుబాట్లు చేసుకొంటాము,” అని అన్నారు.